అత్తను కర్రతో కొట్టడానికి కోడలు దూసుకొచ్చింది.. కింద కూర్చున్న అత్త ‘కొట్టకమ్మా’ అంటూ చేతులెత్తి దండం పెట్టింది. అయినప్పటికీ ఆమెను ఆ కోడలు కర్రతో కొట్టింది. అంతేకాదు, ఉదయాన్నే చలికి తట్టుకోలేకపోతోన్న అత్తపై ఆ కోడలు నీళ్లు పోసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఎటాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ హృదయవిదారక దృశ్యాన్ని ఆ ఇంటి పక్క నుండే వారు తమ స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించారు. దీన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ‘మేము ఈ వీడియోను చూసి ఆ కోడలిని అరెస్టు చేశాం. సీనియర్ సిటిజన్స్ యాక్ట్‌తో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్టు చేశాము’ అని ఎటా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ సింగ్ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.
Sad how our elderly suffer. This woman is beating her old mentally challenged mother in law. Arrested now after video went viral by Etah Police.
Posted by Deepika Narayan Bhardwaj on Monday, 10 February 2020