మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట లోని ఓ గ్రామానికి చెందిన SC నిరుపేద అనాద అమ్మాయి ఎవరు ఆదుకోవడం లేదన్న ఆవేదనకు గురయ్యి మానసిక ఒత్తిడి లో తన వద్ద ఉన్న విషం గుళికలు మింగటం తో అపస్మారక ప్రాణాపాయ స్థితి కి పోయింది,తను చదువు లో టాపర్ ఇంటర్ లో95%, డిగ్రీ పూర్తి చేసి 92% ఉత్తిర్ణత పొంది సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంది. కాగా ఇటీవలే తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్యత్నానికి పాల్పడింది. వెంటనే విషయం తెలుసుకున్న స్వేరో విద్యార్థులు సాగర్, వెంకటేష్ లు చికిత్స కోసం ఇల్లంత కుంట కు తీసుకెళ్లగా మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కి తీసుకెళ్లమని చెప్పగా వెంటనే వారు BSP జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ నిషాని రామచంద్రం గారి దృష్టి కి తీసుకెళ్లగా తను స్పందించి కరీంనగర్ లోని సురభి మల్టీ స్పేషాలిటి హస్పిటల్ లో ఎలాంటి ఫీజు లేకుండా,ఇంతటి కరోన సమయంలో ఎలాంటి అడ్వాన్స్ తీసుకోకుండా, సుమారుగా 80,000 ఖర్చు తో కూడిన మెరుగైన చికిత్స ఉచితంగా అందించారు. సురభి హస్పిటల్ డాక్టర్లు జక్కని తిరుపతి సర్, సాయి బాబు సర్ , యాజమాన్యం మానవత దృక్పతం తో స్పందించి చికిత్స చేసి యువతికి మనోధైర్యం కల్పించారు. ఆసుపత్రిలో చేర్పించపట్టి నుండి డిశ్చార్జ్ అయ్యేవరకు BSP కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నిషాని రాంచంద్రం గారు చికిత్స వివరాలు తెలుసుకుంటూ వారి వెంట ఉండి, నేడు ఉదయం హస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి, ధైర్యం చెప్పి ఓదార్చినారు.అనంతరం యువతికి ఒక దాత ద్వారా వచ్చిన 2,000 విరాళం డాక్టర్ సాయి బాబా గారి చేతుల మీదుగా అందజేశారు. భవిష్యత్ లో అనిత ఉన్నత విద్య కోసం పార్టీ ఆధ్వర్యంలో సహకరిస్తామని చెపుతూ దాతలు ఎవరైనా ముందుకువచ్చి సహకరించగలరని కోరారు,
వారి వెంట BSP మనకొండూర్ ,చొప్పదండి నియోజకవర్గ అధ్యక్షులు సంగుపట్ల మల్లేశం,మంకాలి తిరుపతి, కరీంనగర్ టౌన్ అధ్యక్షులు అస్తపురం శ్రీకాంత్,రామడుగు మండల అధ్యక్షులు వినోద్,BVF ప్రణయ్ ,స్వేరో విద్యార్థులు జేరిపోతుల సాగర్ ,ర్యాగటి వెంకటేష్,BSP ప్రేమ్ పలువురు పాల్గొన్నారు.