ఇక యోనో ఎస్‌బీఐ నుంచి కొనుగోళ్లు జరిపేవారికీ ఆఫర్స్ ఉన్నాయి. యోనో యాప్‌తో బిల్ పేమెంట్ చేస్తే 5% అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్+బోనస్ ఆఫర్ లభిస్తుంది. రూ.25,000 కన్నా ఎక్కువ కొంటే అదనంగా 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ యోనో ద్వారా షాపింగ్ చేసినవారికి మాత్రమే. అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్, బోనస్ ఆఫర్ అమెజాన్ పే బ్యాలెన్స్‌లో క్రెడిట్ అవుతుంది. ఇలాంటి ఆఫర్ల గురించి యోనో ప్లాట్‌ఫామ్‌లో లాగిన్ అయిన తర్వాత బెస్ట్ ఆఫర్స్ పైన క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ జనవరి 22 వరకు కొనసాగుతుంది. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ వేర్, ఫర్నీచర్ ఇలా అన్ని కేటగిరీల్లో ఆఫర్లున్నాయి.
అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ సేల్ ప్రారంభమైంది.జనవరి 19 నుంచి 22 వరకు ఆఫర్స్ అందరికీ లభిస్తాయి. ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్’లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది.అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై 10% ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. రూ.5,000 కన్నా ఎక్కువ షాపింగ్ చేసిన వారు 10% డిస్కౌంట్ రూ.1,500 వరకు పొందొచ్చు. ఎస్‌బీఐ డెబిట్ కార్డుపై షాపింగ్ చేస్తే 10% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో పాటు యోనో యాప్ ద్వారా అమెజాన్‌లో షాపింగ్ చేసేవారికి డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్స్ ప్రకటించింది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference