అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సభ్యులు, తలిదండ్రులు, ఇతర నేతలతో కలిసి ఉదయం 11:30-12 గంటల కల్లా ఆర్‌వో కార్యాలయానికి చేరుకోగా అప్పటికే అక్కడ మరో 40 మంది పైనే ఉన్నారు. ఆయనకు టోకెన్ నెంబర్ 45 ఇచ్చారు. అటు ఎలక్షన్ సిబ్బంది కూడా ఒక్కో అభ్యర్థికీ అరగంట నుంచి గంటసేపు దాకా టైం తీసుకుని, అన్నీ తాపీగా చెక్ చేస్తూ గడిపారు. ఫలితంగా 3 గంటలకు నామినేషన్ పత్రాల దాఖలు గడువు ముగియాల్సి ఉండగా అది కాస్తా సాయంత్రం 7:30 దాకా సాగింది. దీంతో కేజ్రీవాల్ సాయంత్రం 6:30 గంటలకు తన పత్రాలను సమర్పించారు.ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ పత్రాల దాఖలులో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయలేదని ఢిల్లీ ఎన్నికల కమిషన్(ఈసీ) స్పష్టం చేసింది. అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ స్వీకరించడంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఉద్ధేశపూర్వకంగా ఆలస్యం చేయలేదని, నామినేషన్లు స్వీకరించేటుపుడు పత్రాలను తనిఖీ చేయడానికి సమయం తీసుకున్నారని ఈసీ వివరణ ఇచ్చింది.ఒక్కో అభ్యర్థి నామినేషన్ తనిఖీ చేయడానికి 30 నిమషాలు పడుతుందని ఈసీ తెలిపింది.
credit: third party image reference