కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామములో హరితహారం ఏడవ విడత లో భాగంగా ఇంటి ఆవరణలో పెంచే మొక్కలను స్థానిక జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ పంపిణీ చేశారు. గ్రామములో మహిళ సంఘం సభ్యుల సమావేశం అనంతరం మహిళలకు మొక్కలు అందజేశారు, జడ్పీటీసీ గీకురు రవీందర్ ఇంటింటికి వెళ్లి మొక్కలు అందజేస్తూ ప్రతి ఇంటికి 6 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు, వృక్షో రక్షతి రక్షతః, మనం చెట్లను కాపాడుకుంటే అవి మనల్ని కాపాడుతాయని, హరిత హారంలో మహిళలు భాగస్వాములై కార్యక్రమమం విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీమూర్తి రమేష్, ఏపీఓ అనురాధ, వార్డు సభ్యులు వంతడుపుల దిలీప్ కుమార్, బొల్లి సుమలత, కార్యదర్శి గూడూరి హేమలత, బిల్ కలెక్టర్ మధు, ఐకేపీ CC వెంకటమల్లు, మహిళా సహాయకురాలు లత, వసంత గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు