రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రం భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో మహాత్మా జ్యోతి రావు పూలె 194 వ జన్మదిన సందర్బంగా బాపుపులే చిత్ర పటానికి ఘననివాళ్లు అర్పించిన బెంద్రం తిరుపతి రెడ్డి మండల బీజేపీ అధ్యక్షులు మాట్లాడ్తూ సామజిక తత్వవేత్వా ఉద్యమకారుడైన జ్యోతి రావ్ గోవిందరావుపూలే మహారాష్ట లోని సతారా జిల్లా లోని వ్యవసాయ కుటుంబంలో 11ఏప్రిల్ 1827 సంవత్సరం లో జన్మించిన ఏడాది లోపే జ్యోతి రావ్ పూలె తల్లి చనిపోయింది, తండ్రి గోవిందరావు కూరగాయలు అమ్ముతు కుటుంబన్ని పోషించేవాడు, పూలె గారు ప్రజల్లో వితంతు పునర్వివాహం గురించి చైతన్యం తీసుకొచ్చాడు, పూలె 1864 సం లో గర్భస్రావ వెతిరేక కేంద్రాన్ని స్థాపించాడు, ఈ కేంద్రం ద్వారా వితంతువులైన గర్భణి స్త్రీలకు అండగా నిలిచారు,సమాజంలోని కులపరమైన వివక్షను అన్యాయలను రూపుమాపడానికి తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడు అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో బీజేపీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రవణ్, మండల ఓబీసీ అధ్యక్షులు అనగోని అవినాష్, మండల బీజేవైఎం అధ్యక్షులు బండారి రాజ్, గౌరవేణి శ్రీకాంత్, చల్లూరి భాను, పున్ని ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.