గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై శుక్రవారం ఆయా శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జనవరి, 26న ఉదయం పబ్లిక్‌గార్డెన్స్‌లో వేడుకలు జరుగుతాయని అన్నారు. ఈ నెల 26న పబ్లిక్‌గార్డెన్స్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుక లకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు.వేడుకల సందర్భంగా అవసరమైన పోలీస్‌బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు, బారికేడింగ్ తదితర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌సిన్హా, డీజీపీ మహేందర్‌రెడ్డి, సమాచార పౌరసంబంధాలశాఖ కమిషనర్ అర్వింద్‌కుమార్, రోడ్లుభవనాలశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు.