రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేతలతోనే కాదు, మాటలతోనూ ఉక్రెయిన్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటూ ఉక్రెయిన్ సైన్యానికి పిలుపునిచ్చారు. అధికారాన్ని అందిపుచ్చుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఉక్రెయిన్ ప్రభుత్వ పెద్దలను డ్రగ్స్ బానిసలు, ఉగ్రవాదులు, నియో నాజీలుగా అభివర్ణించారు.
“నియో నాజీలకు మానవ కవచాలుగా మీ కుటుంబ సభ్యులను ఉండనివ్వొద్దు. డ్రగ్స్ బానిసలు, నియో నాజీల ముఠాతో కంటే సైన్యంతో ఓ అభిప్రాయానికి రావడమే మాకు సులువు. అందుకే మరోసారి చెబుతున్నా… ఉక్రెయిన్ అధినాయకత్వాన్ని పీకిపారేయండి” అని పేర్కొన్నారు.