ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థుల తరలింపు కార్యక్రమం ఆపరేషన్ గంగ కొనసొగుతోంది. ఇప్పటిదాకా 709 మందిని రుమేనియా రాజధాని బుకారెస్ట్ మీదుగా తరలించారు. వారు మూడు విమానాల్లో విడతల వారీగా స్వదేశం చేరుకున్నారు. కాగా, 198 మందితో బుకారెస్ట్ నుంచి నాలుగో విమానం భారత్ బయల్దేరింది.
బుకారెస్ట్ నుంచి తొలి విమానంలో 219 మంది ముంబయి వచ్చారు. రెండో విమానంలో 250 మంది ఢిల్లీకి చేరుకున్నారు. బుడాపెస్ట్ నుంచి మూడో విమానంలో 240 మంది ఢిల్లీకి వచ్చారు.