కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని EMRI 108 అంబులెన్స్ సర్వీసులో పైలెట్ గా పని చేస్తున్న ముక్కెర సదానందంకు తెలంగాణ రాష్ట్ర ఉత్తమ 108 అంబులెన్స్ పైలెట్ అవార్డుకు ఎంపిక అయ్యరు.ఈ సందర్భంగా కరీంనగర్ DM&HO డాక్టర్ రాంమోహన్ రావు అవార్డ్ ను అందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్, కరీంనగర్ జిల్లా 108 ఎమర్జెన్సీ మెడికల్ ఎగ్జిక్యూటివ్ సంపత్ కుమార్, స్టేట్ కో-ఆర్డినేటర్ ప్రణీత్ రెడ్డి, అసిస్టెంట్ ప్లీట్ కో-ఆర్డినేటర్ క్రాంతి కుమార్ మరియు చిగురుమామిడి108 సిబ్బంది అశోక్, పైలెట్ సంపత్ రెడ్డి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.