మావోయిస్టు పార్టీ నక్సలైట్లకు, పోలీసులకు మధ్య సోమవారం జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో ఇద్దరు మహిళా నక్సలైట్లు మరణించారు. ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లా కిరండోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. తమకు అందిన సమాచారం మేరకు డీఆర్జీ పోలీసులు నక్సలైట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా కుకొండలోని కల్పిపాల్-కాక్రాయ్ అడవుల్లో పరస్పరం ఎదురుపడిన నక్సలైట్లు, పోలీసుల మధ్య కాల్పులు జరిగినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళా నక్సలైట్లు మరణించారని, వారిద్దరిపై రూ. ఐదు, రెండు లక్షల చొప్పున రివార్డు కూడా ఉందన్నారు.
మృతి చెందిన మహిళా నక్సల్స్ ను అయాతి మాండవి, బ్యాడ్జ్ మాండవిలుగా గుర్తించామన్నారు. ఘటనా స్థలంలో ఒక తుపాకీ, మరో పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నట్లు దంతెవాడ ఎస్పీ వివరించారు.