ఎస్ ఎఫ్ ఐ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 4వ మహాసభలు. విద్యారంగాన్ని పాలకవర్గాలు బ్రస్టు పట్టిస్తున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్. మూర్తి ,ఉపాధ్యక్షుడు టి. రవి అన్నారు. ఈసీఐఎల్ కాప్రా మండలంలో భారత విద్యార్థి ఫెడరేషన్ నాలుగవ మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశం లో ఉన్నటువంటి సి ఎ ఎ, ఎన్ అర్ సి,ఎన్ పి అర్ బిల్లు నీ రద్దు చేయాలని, మరియు నూతన విద్యా విధానాన్ని అమలు చేయొద్దని, యూనివర్సిటీ లో మతోన్మాద ఘర్షణలను ఆపి, యూనివర్సిటీ స్వేచ్ఛను కాపాడాలని తెలిపారు. ఈ సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ మేడ్చల్ మల్కాజిగిరి నూతన జిల్లా కమిటీ 23 మంది సభ్యులతో ఎన్నుకోవడం జరిగింది. ఆఫీస్ బేరర్స్ 11 మంది ఎన్నికయ్యారు, జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులుగా ఎన్. భవాని, పి. శంకర్ , ఉపాధ్యక్షులుగా ఆర్.సంతోష్, ఏం. సాయి కిరణ్ ,బి వెంకటేష్ చంద్రకాంత్, సహాయ కార్యదర్శులు గా అఖిల, తేజస్విని, ఉపేందర్, పరమేశ్వరి.