ఏపీలో ఇసుక కొరత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణాను అరకట్టడానికి సీఎం జగన్.. 14500 టోల్ ఫ్రీ నంబరును ప్రారంభించారు. ఇసుక అక్రమ నిల్వలు, అధిక ధరల విక్రయాలు ఉన్నా ఈ నంబరుకు ఫోను చేసి ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. ఈ టోల్ ఫ్రీ నంబరును ప్రారంభించిన వెంటనే జగన్.. 14500 నంబరుకు కాల్ చేసి అక్కడ పనిచేస్తున్న అధికారులతో మాట్లాడారు.కాల్ సెంటర్ ఉద్యోగులకు జగన్ పలు సూచనలు చేసి, ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఆదేశించారు.