శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకూ ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం, మొత్తం కేసులు 405కు చేరాయని పేర్కొంది.”రాష్ట్రంలో నిన్న రాత్రి 9 నుంచి ఈరోజు సాయంత్రం 5 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో గుంటూరులో 17, కర్నూలులో 5, ప్రకాశం మరియు కడప జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదైంది. కొత్తగా నమోదైన 24 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 405 కి పెరిగింది” అని వైద్య ఆరోగ్య శాఖ నిర్వహణలోని ఆరోగ్యాంధ్ర ట్విట్టర్ ఖాతా వెల్లడించింది. కాగా, ఏపీ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ సోకి ఆపై వైరస్ తగ్గి రికవరీ అయిన వారి సంఖ్య 11కు చేరిందని ప్రభుత్వం పేర్కొంది.
రోజు రోజు కు కరోన కెసులు పెరుగుతూనే ఉన్నాయి ఇకనైన ప్రభుత్వం రాజకియాలు పక్కన పెట్టి సరైన నిర్ణయాలు తీసుకుంటె ప్రజలకు , రాష్ట్రానికి మంచిదని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా అద్యక్షులు వి.సుధాకర్ తెలిపారు . ఇతువంటి సమయంలోనే సియం జగన్ మొహన్ రెడ్డి మీద బురద జల్లే కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి… ఉంటున్నయి , అలంటప్పుడే సియం తీసుకునే నిర్ణయాల పైనే ఆధారపడి ఉంటుంది కరోనా మహమ్మారి ని పాలద్రొలడం గాని రాష్ట్ర భవిష్యత్ ని నిర్దెసించె విధంగా . రాష్ట్రానికి అవసరమైన సూచనలు చాల ముఖ్యం . అప్పుడే దేశంలోనె ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలుస్తారు . ఇకనైన రాష్త్ర భవిష్యత్ ని , ప్రజలను ద్రుస్టిలొ పెట్టుకుని పాలన విధానంలో మంచి మార్పు తెస్తే మంచిదని సుధాకర్ కోరారు