జిల్లాలో కోవిడ్ ఉద్ధృతి ఎక్కువ ఉన్నందున, నియంత్రణ చర్యల్లో భాగంగా కొత్తగా 5 ఐసోలేషన్ సెంటర్ లను సోమవారం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె .శశాంక ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రామాలలో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు ,ఇంటి వద్ద హోమ్ సొల్యూషన్ లో ఉండుటకు వసతులు లేక ఇబ్బందులు పడే వారందరూ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన హోం హై సొల్యూషన్ సెంటర్లను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.
ఈ హోమ్ ఐసోలేషన్ సెంటర్ లు
👉చిగురుమామిడి మండలానికి సంబంధించి వారికి ముల్కనూర్ గ్రామంలోని మోడల్ స్కూల్ లో..
👉గన్నేరువరం మండలం నాకు కు సంబంధించి గుండ్లపల్లి లోని మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో,
👉మానకొండూరు మండలానికి సంబంధించి దేవంపల్లి గ్రామం లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో,
👉చొప్పదండి మండలానికి సంబంధించి నవోదయ పాఠశాలలో
👉జమ్మికుంట మండలం నకు సంబంధించి శాలపల్లి లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో హోమ్ ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు . ఐసోలేషన్ సెంటర్లలో సంబంధిత మండలాల తహశీల్దార్లు, ఎంపిడివోలు , మండల పంచాయతీ అధికారులు వసతి భోజన , మొదలగు అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీ సిబ్బంది తో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని ఆదేశించారు. కొత్తగా మండలాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లలో డాక్టర్లను, ఏఎన్ఎం లను వైద్య సేవ లు అందించుటకు నియమించాలని కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ని ఆదేశించారు.
👉జిల్లాలో ఇదివరకే కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ లో కోవిడ్ కేర్ సెంటర్ ను,
👉హుజురాబాద్ లో ఐసోలేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు బయట తిరగకుండా ఐసోలేషన్ లో ఉంటూ కరోనాను నియంత్రించుటకు ఈ ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
గ్రామాలలో కరోనా పాజిటివ్ వచ్చిన వారు హోమ్ సొల్యూషన్ లో ఉండుటకు తగిన వసతులు లేక ఇబ్బందిగా ఉన్న వారిని గుర్తించి దగ్గరలోని ఐసోలేషన్ సెంటర్ లో చేర్పించుటకు తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మండల పంచాయతీ అధికారులు ,మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.