మచిలీపట్నం కలెక్టరేట్‌లో భూసంస్కరణల విభాగం అధీకృత అధికారి(ఏఓ)గా పనిచేస్తున్న దాసరి ప్రశాంతి ఓ రైతు నుంచి రూ.3లక్షలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి చిక్కారు. పట్టాదార్ పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ కోసం రూ.6లక్షలు డిమాండ్ చేసిన ప్రశాంతి.. తొలివిడతగా రూ.3లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ ఏఎస్పీ కేఎం మహేశ్వర రాజుతో పాటు బాధిత రైతు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన మోకా రామలింగేశ్వరరెడ్డి కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరు వద్ద 4.53 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. పసుపుకుంకుమ కింద వచ్చినట్టుగా కోర్టు నుంచి పొందిన ఆర్డర్ ఆధారంగా కృష్ణకుమారి అనే ఆమె నుంచి ఈ భూమిని కొనుగోలు చేసి 2.53 ఎకరాలు తన పేరిట, మరో ఎకరం తన తల్లి మోకా జయలక్ష్మి, ఇంకో ఎకరం భూమి తన సోదరి ఆళ్ల జానకీదేవి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )