కరోనా – ఆకలి కేకలు కథనం పై కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన ఏడో వార్డ్ సభ్యులు తెల్ల రవీందర్ , సుమలత కుటుంబ సభ్యులతో కలిసి అక్షర మీసేవ మెడికల్ జనరల్ స్టోర్ సిమెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఆ నిరుపేద కుటుంబానికి 50 కేజీల బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఉదారతను చాటుకున్నారు. అలాగే మానకొండూర్ నియోజవర్గ టిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు గూడూరి సురేష్ ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి రెండు వేల రూపాయలు అందజేశారు, ఉపసర్పంచ్ బూర వెంకటేశ్వర్ 25 కేజీల బియ్యం, చొక్కారావు పల్లె గ్రామానికి చెందిన హరికాంతం గోపాల్ రెడ్డి మరియు ఆర్ఎస్ఎస్ మండల కార్యకర్త హరికాంతం అనిల్ రెడ్డి తో కలిసి 50 కిలోల బియ్యం 500 రూపాయలు కనుకవ్వ కుటుంబానికి సహాయం చేసి ఉదారతను చాటుకున్నారు. రిపోర్టర్ టివి కథనం ద్వారా ఎందరో పెద్దలు స్పందించి సహాయం చేసినందుకు టిపోర్టర్ టివి తరుపున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.