కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామపంచాయితి కార్యాలయంలో బుధవారం మండలానికి చెందిన 13 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు మరియు చాకలివాని పల్లి మరియు సాంబయ్యపల్లి గ్రామాలకు మంజూరైన ట్రాక్టర్లను మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈకార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి,జడ్పీటీసీ మడుగుల రవీందర్ రెడ్డి, ఎమ్మార్వో రమేష్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు చింతలపల్లి నరసింహారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు బేతేల్లి సమత -రాజేందర్ రెడ్డి, కర్ర రేఖ – కొమురయ్య,నక్క మల్లయ్య, తీగల మోహన్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు గంప వెంకన్న, మహిళలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.