కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన కాల్వ మల్లేశం ను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు చిట్కారి అనంత రెడ్డి తెలిపారు. ఉపాధ్యక్షులుగా వరుకోల్ సంతోష్, ప్రధాన కార్యదర్శిగా గుంటుక శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి జాగిరి శ్రీనివాస్ గౌడ్, పాల్గొని మాట్లాడారు పార్టీని బలోపేతం కి కృషి చేయాలని, ప్రజల సమస్యలపై పోరాడాలని కార్యకర్తలకు సూచించారు అలాగే మండలంలోని చీమలకుంటపల్లె గ్రామ శాఖ అధ్యక్షుడిగా పకిడే వీరేశం, ఉపాధ్యక్షునిగా బామండ్ల అంజనేయులు కార్యదర్శులుగా రాజేశ్వరరావు, సంతోష్ లను ఎన్నుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నల్ల చంద్ర రెడ్డి గంప మహేష్ ,గుంటుక రమేష్ తదితరులు పాల్గొన్నారు