కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామపంచాయతీ లో ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన కొరివి లక్ష్మణ్ అనే వ్యక్తి సోమవారం సాయంత్రం అదే గ్రామ శివారులోని ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉన్న విద్యుత్ స్తంభం పైకి ఎక్కి బల్బును పెట్టే క్రమంలో కాలుజారి స్తంభం పైనుండి కింద పడ్డాడు స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులతో హుటాహుటిన కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు కొరివి లక్ష్మణ్ కు నడుము మరియు ముక్కుకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 10 గంటలకు మృతి చెందినట్లు గ్రామ సర్పంచ్ గ్రామస్తులు తెలిపారు మృతునికి ఒక కుమారుడు ఉన్నాడు భార్య ఇంద్రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు