ఎవరైనా తల్లిదండ్రులు కాలేజీలకు ఫీజ్ కడితే కనుక ఆ డబ్బును కాలేజీ యాజమాన్యాలు వెనక్కి ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. ‘జగనన్న విద్యా దీవెన’ పథకంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యాలకు చెప్పామని అన్నారు.ఏమైనా సమస్యలుంటే విద్యార్థుల తల్లిదండ్రులు 1902 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. ఉన్నత విద్యా శాఖలో కాల్ సెంటర్ ఉంటుందని, దీనిపై సీఎం కార్యాలయం పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని చెప్పారు. తల్లిదండ్రులు వారి పిల్లలను గొప్పగా చదివించాలని, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ‘దేవుడి దయతో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నానని’ జగన్ అన్నారు.