మళ్లీ ఇళ్లల్లోకి చేరిన కాళేశ్వరం నీరు…
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని మన్నెంపల్లి గ్రామం లో వరద కాల్వ కు బుంగ పడి గ్రామం లోకి భారీగా నీరు చేరింది. గ్రామమంతా జలమయం కావడం తో గ్రామస్తులంతా భయాందోళనకు గువుతున్నారు.డిప్యూటీ ఇంజనీర్ నిన్న గ్రామాన్ని వచ్చి సందర్చించి వెళ్ళాడు అని ఎలాంటి హామీ గాని, చర్యలు తీసుకుంటామని గానీ చెప్పలేదని ఇప్పుడు మళ్లీ కాలువ నీరు ఇళ్లలోకి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు ప్రాణాలు పోతేనే చర్యలు తీసుకుంటారా అని మండిపడ్డారు.