జీ ప్లస్ 2 అనుమతి
కడుతుంది నాలుగు అంతస్తులు
అధికారుల నిర్లక్ష్యమా ?
లేక కాసులకు కక్కుర్తిపడి పర్మిషన్లు ఇచ్చారా ?
హైదరాబాద్ : కూకట్ పల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఆనంద్, దయ అనే ఆ ఇద్దరు కూలీలు యూపీకి చెందినవారు. వారి మృతదేహాలను వెలికితీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో భారీ క్రేన్ సాయంతో శిథిలాలు వెలికితీశారు.
ఈ భవన యజమాని జీ ప్లస్ 2 అనుమతి తీసుకుని ఐదంతస్తుల నిర్మాణం చేపడుతున్నట్టు గుర్తించారు. నాలుగో అంతస్తుకు స్లాబ్ పనులు చేపడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. యజమానిపై కేసు నమోదు చేస్తామని అధికారులు అంటున్నారు. ప్రమాదం జరిగినప్పుడు అధికారులు నామమాత్రమే స్పందిస్తున్నారు కానీ పూర్తిగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినవస్తున్నాయి. అనుమతి రెండు అంతస్తులకు ఉంటే నాలుగు అంతస్తులు ఎలా కడుతున్నారు? స్థానిక మున్సిపల్ అధికారులు ఏమి చేస్తున్నారు. అధికారుల లోపం వలనే ఇటువంటి ప్రమాదాలకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది