అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సరిలేరు నీకెవ్వరూ సినిమాలో కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాలోని కొన్ని సన్నివేశాలను వాడుకున్నారు. సరిలేరు నీకవ్వరు సినిమా చూసిన తర్వాత నాన్నగారు అనిల్ ని కలవాలని అన్నారు. ఇంతవరకు నాన్న ఎప్పుడూ ఒకరిని కలవాలని అడగలేదు. నాన్న నేను కలిసి నటించాలని అనుకుంటున్నాం అది అనిల్ వల్లే సాధ్యమని అనుకుంటున్నానని” చెప్పుకొచ్చాడు మహేష్ ఇక అనిల్ రావిపూడి తో కూడా మహేష్ మరో సినిమాని చేస్తానని ఇప్పటికే ప్రకటించాడు. మొత్తానికి కృష్ణ – మహేష్ బాబుని ఒకే స్క్రీన్ పైన త్వరలో చూడబోతున్నామని ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ఇదే సినిమాలో మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణని కూడా నటింపజేస్తే అక్కినేని తర్వాత ఫ్యామిలీ హీరోస్ కలిసి నటించిన చిత్రంగా టాలీవుడ్ లో ఘట్టమనేని కుటుంబం చరిత్ర సృష్టించినట్టు అవుతుంది. చూడాలి మరి ఎం జరుగుతుందో ..ధియేటర్లో ఈ సన్నివేశాలకి మంచి స్పందన వచ్చింది. దీనితో మళ్ళీ మహేష్ -కృష్ణ నటించాలని అన్న డిమాండ్స్ వచ్చాయి. ఈ నేపధ్యంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో మహేష్ బాబు స్పందించాడు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )