మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. గత కొద్ది రోజులుగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం రీసెంట్‌గా సెట్స్‌పైకి వెళ్ళింది. థాయిలాండ్‌లోని దట్టమైన అడవుల్లో చిత్ర షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా , ఇందులో కోలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తున్నారు. మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రంలో జయం రవి, కార్తీ, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి, మోహన్ బాబు, ఐశ్వర్యరాయ్, అమితాబ్ బచ్చన్ వంటి పలువురు స్టార్స్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఏఆర్ రెహమాన్ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, మొత్తం 12 పాటలని ఆయన రూపొందిస్తున్నారట. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ క్లాసిక్ స్టైల్‌లో ట్యూన్స్ సిద్దం చేస్తున్నట్టు టాక్. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్‌లో సినిమా పోస్టర్ విడుదల చేసింది. ఇందులో కత్తిని చూపించారు. ఇక మీ అందరి ఆశీర్వాదాలతో ఓ పెద్ద ప్రయాణాన్ని మేం మొదలు పెట్టాం అని కార్తీ ట్వీట్ చేశారు
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )