‘వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో తెలుగు దేశంపార్టీ అభ్యర్థుల దుస్థితి ఇది’ అంటూ టీడీపీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పలు వివరాలు వెల్లడిస్తూ ఫొటోలు పోస్ట్ చేసింది. ‘పోలీసులు తెలుగు దేశంపార్టీ అభ్యర్థులను నామినేషన్ వేసేందుకు అనుమతించకపోవడంతో ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన మహిళా అభ్యర్థులు ఇలా గేట్లెక్కి లోనికి వెళ్లాల్సి వచ్చింది’ అని తెలిపింది. గేట్లు మూసేసి ఉండడంతో కొందరు మహిళలు గేట్లు ఎక్కడం ఈ ఫొటోల్లో కనపడుతోంది.