contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

చంద్రయాన్‌ 3 మిషన్‌కు రంగం సిద్ధం : ఇస్రో చీఫ్‌ కే శివన్‌

 చంద్రయాన్‌ 3 మిషన్‌కు పనులు ప్రారంభించామని తెలిపారు . చంద్రమండలానికి మానవ మిషన్‌ను ఇస్రో చేపట్టే ప్రయత్నాలపై ఆయన స్పందిస్తూ ఇది ఇప్పటికిప్పుడే సాధ్యం కాకున్నా ఏదోఒక రోజు ఇది సాకారమవుతుందని అన్నారు. ఇక చంద్రయాన్‌ 3 ల్యాండర్‌, క్రాఫ్ట్‌ ఖర్చు దాదాపు రూ 250 కోట్లు కాగా, లాంఛ్‌కు రూ 350 కోట్ల వ్యయమవుతుందని శివన్‌ వెల్లడించారు.
చంద్రయాన్‌-2లో మాదిరిగానే చంద్రయాన్‌-3లోనూ ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ ఉంటాయని అన్నారు. చంద్రయాన్‌-2లో ఆర్బిటర్‌ మిషన్‌ జీవితకాలం 7 సంవత్సరాలని, చంద్రయాన్‌-3లోనూ దీనిని ఉపయోగిస్తామని చెప్పారు. మరోవైపు గగన్‌యాన్‌ మిషన్‌కు సంబంధించి ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములు ఈ మాసాంతానికి శిక్షణ నిమిత్తం రష్యా వెళతారని చెప్పారు. 1984లో రాకేష్‌ శర్మ రష్యన్‌ మాడ్యూల్‌లో అంతరిక్షంలోకి వెళ్లగా, ఈసారి భారత వ్యోమగాములు దేశీ మాడ్యూల్‌లోనే భారత్‌ నుంచి వెళతారని ఆయన తెలిపారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :