‘ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి వెనుక ఉన్న ఆ స్త్రీ మూర్తులు వీరే’ అంటూ వైసీపీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వీడియో రూపొందించింది.రాజకీయ పరంగా జగన్‌ను ఇబ్బందులకు గురి చేశారని, ఆ సమయంలో ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, భార్య భారతి ఆయనకు అండగా నిలిచారని అందులో తెలిపారు. ‘నేను మీ రాజన్న బిడ్డను.. జగనన్న విడిచిన బాణాన్ని’ అంటూ వైఎస్ షర్మిల… జగన్ జైలులో ఉన్నప్పుడు చేసిన ప్రచారాన్ని గుర్తు చేశారు.
ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు. మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి వెనక ఉన్న ఆ స్త్రీ మూర్తులు వీరే#YSJaganEmpowersWomen #HappyWomensDay2020 pic.twitter.com/YmxGsug7PD
— YSR Congress Party (@YSRCParty) March 8, 2020