శార్వరీ నామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా ప్రింట్ & ఎలట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షలు వి.సుధాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశం లోని ప్రతి జర్నలిస్ట్ ఇల్లు, ప్రజల ఇల్లు సుఖసంతోషాలతో కళకళలాడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. షడ్రుచుల ఉగాది ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలిగించాలని అభిలషిస్తున్నట్టు వెల్లడించారు. అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని సామూహిక వేడుకలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కొన్నాళ్ల పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు.