కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పౌరసత్వ చట్టం, జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్)పై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. తమ వ్యక్తిగత విషయాలు ఎందుకు తెలపాలంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.సంక్షేమ పథకాలు పక్కాగా చేరేందుకు ఎన్పీఆర్ ఉపయోగపడతాయని కేంద్రం పేర్కొంది.ఇప్పటికే పశ్చిమ బెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాలు ఎన్‌పీఆర్, ఎన్నార్సీని,సీఏఏ అమలు చేయమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
2021 జనాభా లెక్కలపై చర్చించడానికి అన్ని రాష్ట్రాల అధికారులతో శుక్రవారం కేంద్రం ఓ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఎన్‌పీఆర్‌లో చేర్చిన కొన్ని ప్రశ్నలు ప్రజలను అడగడం సాధ్యంకాదని పలువురు తమ అభిప్రాయాలు వెల్లడించారు.దీనిపై వచ్చిన అభ్యంతరాల ఆధారంగా ఎన్పీఆర్ విధానంలో కొన్ని మార్పులకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది.దీంతో పాటు ఎన్‌పీఆర్ కోసం రూపొందించిన మొబైల్ యాప్‌పై కూడా అధికారులకు వివరించారు. ఈ సమయంలో ఎన్పీఆర్‌పై కేంద్రం కాస్త వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. దీనిపై ప్రజలతో పాటు పలు రాష్ట్రాల పాలకుల నుంచి వ్యతిరేకత రావడంతో కొంత వెసులుబాటు కల్పించింది. జనాభా పట్టికలో తల్లిదండ్రుల వ్యక్తిగత వివరాలు, పుట్టిన స్థలం వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
credit: third party image reference