టిడిపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు రమణ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు చేతుల మీదుగా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. తర్వాత మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకరరావులతో సమావేశమయ్యారు. సుమారు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ పధకాలపై వారు చర్చించారు. అలాగే రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికల పై కూడా వారు చర్చించినట్టు తెలిసింది.ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.