contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

డిగ్రీ అర్హత తో 6506 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

 

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌స్సీ).. కంబైన్డ్ గ్రాడ్యు యేట్ లెవెల్ (సీజీఎల్) 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపట్టనున్నారు.

Jobs Imagesవివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 6506 (గ్రూప్ బి గెజిటెడ్-250, గ్రూప్ బి నాన్ గెజిటెడ్-3513, గ్రూప్ సి 2743)

పోస్టుల వివరాలు: అసిస్టెంట్ అడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌం టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, టాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్‌పెక్టర్ తదితరాలు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. వయసు పోస్టును బట్టి మారుతుంది.

Must check: SSC CGL study material, practice tests and model papers 

ఎంపిక విధానం: నాలుగు దశల్లో (టైర్-1, టైర్- 2, టైర్-3, టైర్-4) ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. టైర్-1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైర్-2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైర్-3 పెన్ అండ్ పేపర్ (డిస్క్రిప్టివ్ పేపర్ ) విధానంలో జరుగుతుంది. టైర్-4 కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ /డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ ఆధారంగా నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: జనవరి 31, 2021.

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపునకు చివరి తేది: ఫిబ్రవరి 2, 2021.

చలాన్ ద్వారా చెల్లింపునకు చివరి తేది: ఫిబ్రవరి 4, 2021.

టైర్ -1 పరీక్ష తేది: 29.05.2021 నుంచి 07.06.2021 వరకు

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: ssc.nic.in/

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :