మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎఫ్15ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. రూ.19,990 ధరకు ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నారు. ఇందులో.. 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.నో కాస్ట్ ఈఎంఐ విధానంలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులతో ఈ ఫోన్ కొనుగోలుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. జనవరి 26వ తేదీ లోపు ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి వన్ టైం స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్‌ను అందివ్వనున్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference