కరీంనగర్ జిల్లా : గన్నేరువరం దళిత్ శక్తి ప్రోగ్రాం (డి ఎస్ పి) అధినాయకుడు డా.విశారదన్ మహారాజ్ పిలుపు మేరకు జనవరి 26, గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండా ఎగురవేసే ప్రతీ చోట భారత రాజ్యాంగం పుస్తకం మరియు డా బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలను ఉంచాలని అదేవిధంగా దేశ సమగ్రతను తెలిపే భారత రాజ్యాంగ పీఠికను చదివి వినిపించాలని విన్నవిస్తూ మండల ఎమ్మార్వో కె రమేష్ కు డిఎస్పి-రాజ్యాంగ రక్షణ దళం వినతి పత్రం సమర్పించారు ఈ సంధర్భంగా జిల్లా DSP కో- కన్వీనర్ జేరిపోతుల. మహేందర్ మహారాజ్ మాట్లాడుతూ “గత 70 సంవత్సరాలుగ మన ప్రజాస్వామిక దేశంలో ఆగస్టు 15 న స్వాతంత్ర దినోత్సవాన్ని, జనవరి 26 న గణతంత్ర దినోత్సవాన్ని ఏ తేడా లేకుండ ఒకే విధమైన వేడుక జరపడం భాదాకరం అని అన్నారు ఈ రెండు జాతీయ పండుగల మధ్య తేడా ఉందని ఇవి జరుపుకునె ఉద్దేశ్యం వేరు వేరు. ఆగస్టు 15 న ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది కనుక “స్వాతంత్ర దినోత్సవం” జరుపుకుంటాం. జనవరి 26 న ఈ దేశంలోని మనుషులకు విముక్తి ప్రసాదిస్తు భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చింది కనుక దినోత్సవం జరుపుకుంటాం అంటే ఒకటి మట్టికి స్వాతంత్రం మరొకటి మనిషికి స్వాతంత్రం కానీ గణతంత్ర దినోత్సవం నాడు ఎక్కడ కూడా భారత రాజ్యాంగ గ్రంథ చిత్రపటాన్ని మరియు రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటాన్ని పెట్టకుండానే వేడుక నిర్వహించడం మేం గమనించాం అందుకు గణతంత్ర దినోత్సవం రోజు జండా వందన వేడుక జరిగే ప్రతీ చోట, ప్రతీ ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలు మరియు విద్యాసంస్థల్లో డా. అంబేడ్కర్ మరియు భారత రాజ్యాంగ చిత్ర పటాలను విధిగా వుంచాలని అదే విధంగ రాజ్యాంగ పీఠిక(ప్రవేశిక) ను చదివి వినిపించాల్సింది గా అధికార యంత్రాంగాన్ని ఆదేశించాల రాజ్యాంగ ప్రతినిధులైన ఎమ్మార్వో ను కోరారు ఇలా చేయడం ద్వార మన ముందు తరాలకు డా బీఆర్ అంబేడ్కర్ మరియు భారత రాజ్యాంగం యొక్క విలువ మరియు ప్రాముఖ్యత తెలియజేసిన వారము అవుతామని తద్వార విలువలు కలిగిన భావి భారత పౌరలను నిర్మించగలుగుతాం అని తెలియజెసారు ఈ కార్యక్రమంలో డిఎస్పి మండల కో కన్వీనర్స్ సుధాకర్ మహారాజ్ & అనిల్ మహారాజ్ మరియు అన్ని గ్రామాల కన్వీనర్లు అమ్మిగల్ల శ్రీనివాస్, నాగరాజ్, మహేష్,అనిల్, మనువాడ జోషి, ఇళ్ళందుల మహేష్,రాజు తదితరులు పాల్గొన్నారు.