దిశ నిందితుల ఎన్ కౌంటర్ తో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నా కొన్ని మేధావి వర్గాల నుంచి వ్యతిరేక స్పందనలు వస్తున్నాయి. నిందితులు తప్పు చేశారని నిర్ధారించాల్సిందీ, వారికి శిక్షలు విధించాల్సిందీ న్యాయస్థానమని ఏపీ మానవ హక్కుల ఫోరం తీవ్రస్థాయిలో స్పందించింది. రిమాండ్ లో ఉన్న ఖైదీలను పోలీసులు ఎలా చంపేస్తారంటూ ప్రశ్నించింది. దీనిపై న్యాయస్థానం సుమోటోగా కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఫోరం విజ్ఞప్తి చేసింది. దిశ నిందితులను పక్కా ప్రణాళిక ప్రకారమే హతమార్చినట్టు అర్థమవుతోందని, ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై హత్యానేరం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.