కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రతి కుటుంబం గేటు ముందు ఆరుబయట వాకిళ్ళలో 9 దీపాలు తో మహిళలు తొమ్మిది నిమిషాల పాటు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవింద్ 19 కరోన మహమ్మరి ఎదుర్కొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పిలుపుమేరకు ప్రజలంతా ఐక్యంగా పాల్గొన్నారు. యువకులు సెల్ ఫోన్ ,టార్చ్ లైట్, క్యాండీలు వెలిగించి కరోనా నివారణ పోరాటంలో ప్రధాన భాగస్వాములైన వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బందికి భరోసాగా దీపాలు వెలిగించారు లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా స్వచ్చందంగా ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి సహకరించిన అప్పుడు కరోనా ను భారత దేశ వ్యాప్తంగా లేకుండా చేయవచ్చ ని ప్రజలకు అవగాహన కొరకు దీపారాధన చేశారు ఈ సందర్భంగా గన్నేరువరం మండల కేంద్రంలోని ఎస్ఐ ఆవుల తిరుపతి కుటుంబ సభ్యులతో తన నివాసంలో కొవ్వొత్తులతో ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వార్డు సభ్యులు స్వశక్తి సంఘాల మహిళలు వృద్ధులు యువకులు బాలబాలికలు పెద్ద ఎత్తున దీపాలు వెలిగించి మద్దతు తెలిపారు