contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

నకిలీ డాక్యుమెంట్లతో భూ విక్రయాలు… రూ.2 కోట్లకు మోసం

తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వాటితో ‘గ్రీన్‌ సిటీ వెంచర్‌’ అని లే అవుట్‌ చూపిస్తూ ప్లాట్ల అమ్మకానికి తెగబడిన ఏడుగురు ముఠా సభ్యులను భువనగిరి ఓఎస్‌టీ పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ అందించిన వివరాల మేరకు…హైదరబాద్ కి చెందిన్  ప్రధాన నిందితులు పరిదాన్‌ శేఖర్‌, ఏనుగు మాధవరెడ్డితో పాటు మరో ఐదుగురు ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఆరు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. వాటితో తూఫ్రాన్‌పేట్‌లో గ్రీన్‌సిటీ వెంచర్‌ పేరుతో ప్లాట్ల అమ్మకాలు మొదలు పెట్టారు. ఈ విధంగా పలువురి వద్ద నుంచి దాదాపు రూ.2 కోట్లు కొట్టేశారు. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వీరిని అదుపులోకి తీసుకుని వీరి వద్ద నుంచి రూ.7 లక్షల నగదు, నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :