వెంకటేశ్ హీరోగా నటిస్తున్న ఈ నారప్ప చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే ఈమూవీ షూటింగ్ ప్రారంభమైంది. తమిళ్ హీరో ధనుష్ నటించిన అసురన్ చిత్రం భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈమూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈమూవీలో వెంకటేశ్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను అనంతపురంలో చిత్రికరిస్తున్నారు. తాజాగా ఈమూవీలో వెంకటేశ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ చిత్రానికి ‘నారప్ప’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. కుల వ్యవస్థ దాని మూలంగా జరిగిన గొడవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సినిమాను ఈ ఏడాది ప్రథమార్థంలోనే విడుదల చేయనున్నారు. వరుస విజయాలతో వెంకటేశ్ దూసుకుపోతున్నాడు. ఇటివలే వెంకీమామతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference