కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలోని గౌడ సంఘ భవనంలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో THEME BASED AWARENESS AND EDUCATION కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల ఎమ్మార్వో కె రమేష్, డిస్ట్రిక్ట్ యూత్ కో ఆర్డినేటర్ రాంబాబు, రాచకొండ గిరిబాబు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మరియు అనిల్ రెడ్డి పాల్గొని ఎమ్మార్వో రమేష్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని స్వయం ఉపాధి చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు రాచకొండ గిరిబాబు మాట్లాడుతూ మన దేశం ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మనదేశం సనాతన దేశం అని,ఎన్నో అత్యాధునిక టెక్నాలజీలో మన దేశం దూసుకుపోతుందని ప్రపంచ దేశాలకు మన దేశం విశ్వ గురువుగా మారాలని అని యువత సమాజంలో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ సమాజ అభివృద్ధికి పాటుపడాలని దేశం కోసం పని చేయాలని అన్నారు. అనిల్ రెడ్డి మాట్లాడుతూ పి.ఎం.కె.వి.వై, పి.ఎం.ఈ.జి.పి, D.D.U.J.K.Y, ఫసల్ బీమా యోజన,స్వచ్ఛ భారత్ అభియాన్ ఇలాంటి ఎన్నో అభివృద్ధి పథకాల మీద యువజన సంఘాల నాయకులకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రజినీకాంత్, శంకర్,అజయ్ నవీన్, వినయ్, చందు,హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.