కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో బుధవారం పదవ తరగతి పరీక్షలు కోసం ఏర్పాట్లను పరిశీలిస్తున్న డిపార్ట్మెంట్ అధికారి ఎస్ మనోహర్ రెడ్డి,చీప్ సూపరిండెంట్ కె వివేకానంద చారి వారు మాట్లాడుతూ ఈ పరీక్ష కేంద్రంలో మొత్తం 138 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు గన్నేరువరం ఉన్నత పాఠశాల నుంచి 42 మంది విద్యార్థులు, జంగపల్లి ఉన్నత పాఠశాల నుంచి 58 మంది విద్యార్థులు, స్పార్క్ఎల్ పాఠశాల నుంచి ఎనిమిది మంది, శ్రీ రామకృష్ణ ఉన్నత పాఠశాల నుంచి 30 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. విద్యార్థులకు త్రాగునీరు, బెంచీలు, ఫ్యాన్లు,డ్యూయల్ డిస్క్ లను ఏర్పాటు చేశారు. స్కాడ్ లుగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు వస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా వ్యాధిపై ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. అనుమానాలు ఉంటే స్క్రీనింగ్ టెస్టులు కూడా నిర్వహిస్తామన్నారు