భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పర్ణశాల తెప్పోత్సవం కార్యక్రమంలో అపశృతి. కార్యక్రమం జరుగుతుండగా బాణాసంచా పేల్చే క్రమంలో ఒకేసారి అన్ని బాణాసంచాలు పేలడంతో భయపడి గోదావరి నదిలోకి దూకిన ముగ్గురు యువకులు. ఇద్దరూ క్షేమంగా బయటకు రాగా కొప్పుల శంకర్ అనే తాత్కాలిక ఉద్యోగి గల్లంతు అయినట్లు సమాచారం. శంకర్ ఆచూకీ కోసం నదిలో వెతుకుతున్న రెస్క్యూ టీం.