పల్లె ప్రగతి రెండో విడతలో భాగంగా ప్లాస్టిక్ నివారణ కార్యక్రమంలో భాగంగా గన్నేరువరం మండలంలోని ఖాసీంపెట్ గ్రామ పంచాయతీ ఆవరణలో మంగళవారం గ్రామ సర్పంచ్ గంప మల్లేశ్వరి- వెంకన్న అధ్వర్యంలో గ్రామస్తులకు ఉచితంగా బట్ట సంచులు పంపిణి చేశారు అనంతరం ప్లాస్టిక్ వాడొద్దు బట్ట సంచుల వాడాలని గ్రామ మహిళా సంఘం సభ్యులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్లాస్టిక్ వాడొద్దని బట్ట సంచుల వాడాలని గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి, వార్డు సభ్యులు ఐలయ్య, మల్లారెడ్డి అంగన్వాడి టీచర్స్, పంచాయతీ కార్యదర్శి ఆనంద్, స్పెషల్ ఆఫీసర్ నరేష్, మహిళా సంఘం సి.ఏ లు సంపత్, పద్మ, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు