త్రివిక్రమ్‌కు కాపీ క్యాట్ అన్న పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఒక్కోసారి పక్క చిత్రాల కథలను కాపీ కొడితే. ఒక్కోసారి తన సినిమాలోని కొన్ని సన్నివేశాలను కాపీ చేసి తీసేస్తూ ఉంటారు. ఏ దర్శకుడికైనా సరే ఎన్ని హిట్ చిత్రాలు వచ్చిన ఒక్క ఫ్లాప్ వచ్చిందంటే చాలు ఫ్యాన్స్ ఆడేసుకుంటారు.అందులోనూ ఈ మధ్య సోషల్ మీడియా బాగా పెరిగిపోవడంతో ఇది మరి కాస్త ఎక్కువయిందనే చెప్పాలి.
ప్రస్తుతం త్రివిక్రమ్ బన్నీతో కలిసి తీసని అలవైకుంఠపురంలో చిత్రం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ ఇప్పుడు పవన్‌కళ్యాణ్ నటించే పింక్ చిత్రం రీమేక్‌కి డైలాగ్స్‌ను అందిస్తున్నారని ఫస్ట్ టాక్ వచ్చినా ప్రస్తుతం అది క్యాన్సిల్ అయిందని సమాచారం. ఇప్పుడు ఆయన జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఆర్.ఆర్.ఆర్ చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రానుందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. మరి ఈ ప్రాజక్ట్ పై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఒకవేళ ఇది ముందుకెళ్ళినా దీనికి చాలా టైం అయితే పట్టేటట్టే ఉంది. ఆర్.ఆర్.ఆర్ హడావుడి అయితే గాని ఎన్టీఆర్ త్రవిక్రమ్ వైపుచూడరు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference