కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని టిఆర్ఎస్ మండల నాయకులు సర్పంచ్ బేతేల్లి సమత రాజేందర్ రెడ్డి అన్నారు మంగళవారం మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువుల వ్యాధులు బారిన పడకుండా ముందస్తుగా ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేయిస్తోందన్నారు సీజనల్ వ్యాధులు పశువులకు సోకకుండా రైతులు టీకాలు వేయించాలని పశువులు ఆరోగ్యంగా ఉంటేనే పాడి పంటలు బాగా ఉంటాయన్నారు ఈకార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ KD సాంబరావు,పాల కేంద్రం అధ్యక్షుడు తాళ్లపెళ్లి పరుశరామ్ గౌడ్,ఎల్ఎస్ఏ ఆర్ కిరణ్ రెడ్డి, బుర్ర దేవరాజ్ గౌడ్, ఓఎస్ పి కల్పన, గోపాలమిత్ర సాగర్ రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు