కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో స్వేరోస్ మండల అధ్యక్షులు లింగంపల్లి రమేష్ ఆధ్వర్యంలో మండల పోలీస్ స్టేషన్లో ఎస్సై ఆవుల తిరుపతి చే భీమ్ దీక్ష లో భాగంగా వాల్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది స్థానిక ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భీమ్ దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా స్వేరోస్ ఉపాధ్యక్షులు హనుమాన్ ల యాదగిరి గారు మాట్లాడుతూ మార్చి 15 నుండి ఏప్రిల్ 18 వరకు జరగబోయే భీమ్ దీక్షకు మండల స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లో ఏ ఎస్ ఐ మల్లయ్య, పోలీస్ సిబ్బంది మరియు స్వేరోస్ యాస్ వాడ గ్రామ అధ్యక్షులు బూర నవీన్, స్వేరోస్ మండల అధికార ప్రతినిధి లింగంపల్లి ప్రశాంత్, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మామిడిపల్లి వినోద్, జంగా పల్లి గ్రామ స్వేరోస్ అధ్యక్షులు అల్వాల ప్రదీప్,మాదాపూర్ గ్రామ స్వేరోస్ అధ్యక్షులు సంపతి రాము, మండల ప్రధాన కార్యదర్శి భూ పెళ్లి రమేష్, కొంకటి నవీన్, కొంకటి ప్రకాష్, గువ్వల ప్రవీణ్, ఇల్లందుల హరీష్, సుంకా పాక హరీష్ తదితరులు పాల్గొన్నారు