మంత్రి బ్రహ్మ్ మొహీంద్ర తీర్మానాన్ని ప్రవేశపెడుతూ.పార్లమెంట్ ఆమోదించిన పౌరసత్వ చట్టం పంజాబ్ తో సహా దేశవ్యాప్తంగా ఆవేశాలకు, సామాజిక అశాంతికి కారణమయ్యాయని అన్నారు. ఈ చట్టం వివక్షపూరితమైనదని.మానవత్వానికి దూరంగా ఉందని చెప్పారు. అంతే కాదు సీఏఏ రాజ్యాంగ మౌళిక సూత్రాలైన సెక్యులర్ అస్థిత్వాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు. అందుచేత చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని సభ ఆమోదిస్తుందని తెలిపారు.
నిన్న కేరళ..నేడు పంజాబ్. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తాజాగా పంజాబ్ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. దీంతో కేరళ తర్వాత ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించిన రెండో రాష్ట్రం పంజాబ్.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference