గుంటూరు జిల్లా కారంపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ మంత్రాలమ్మ దేవాలయం వద్ద గల అర్ అండ్ బి బ్రిడ్జి ,
కారంపూడి ఎన్ ఎస్పీ కుడి కాలువ , నాగులేరు బ్రిడ్జిలు మరమ్మత్తులకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నాయి. మాత్రలమ్మ తల్లి దేవాలయం వద్ద ఉన్న బ్రిడ్జి నుండి వందల వాహనాలు తిరుగుతుంటాయి , శ్రీ చక్ర సిమెంట్స్ కి సంబంధించిన సిమెంట్ లోడ్ లారీలు గత ముప్పై సంత్సరాల నుండి తిరుగుతున్నాయి కానీ కనీస మరమత్తులు చక్ర సిమెంట్ వారు చేయకుండా గాలికి వదిలేశారు . అదే కాకుండా నిత్యం పొదిలి , ఒంగోలు , వినుకొండ నుండి హైదరాబాదు వెళ్లే ఆర్టీసీ బస్సులు లారీలు నిత్యం తిరుగుతుంటాయి , కానీ ఇటు ఆర్ అండ్ బి వారు కానీ శ్రీ చక్ర సిమెంట్ వారు కానీ పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. మాత్రలమ్మ తల్లి దేవాలయం వద్ద ఉన్న బ్రిడ్జి దగ్గర ఉన్న మలుపు వద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.