ప్రియాంకా రెడ్డి హత్య కేసుపై మీడియాలో వస్తోన్న నిందితుల పేర్లు సరికావు అని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ కేసు గురించిన వివరాలు తెలిపేందుకు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు ఆలస్యంగా అందిందని అన్నారు. కాగా, ప్రియాంకరెడ్డి కుటుంసభ్యులను సజ్జనార్ పరామర్శించారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించలేదని ప్రియాంక తల్లిదండ్రులు ఆరోపించారు.