శికారిపురకు చెందిన కావ్య (15) నగరంలోని మేరి ఇమ్యాక్యులేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుకుంటూ అదే పాఠశాలకు చెందిన హాస్టల్‌లో ఉండేది. బాలిక ఉరేసుకున్న స్థితిలో మరణించిన సంఘటన సోమవారం నగరంలోని ప్రైవేటు పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ క్రమంలో సోమవారం హాస్టల్ స్టోర్‌రూమ్‌లో కావ్య ఉరేసుకొన్న స్థితిలో శవమై తేలింది. గమనించిన పాఠశాల సిబ్బంది హాస్టల్‌లో ఉంటున్న మిగతా విద్యార్థులను ఇళ్లకు పంపించి పోలీసులకు సమాచారం అందించారు. పాఠశాలకు చేరుకున్న కోటా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కావ్య ఆత్మహత్యపై తల్లితండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా గతనెలలో జరిగిన పరీక్షల్లో కన్నడలో తక్కువ మార్కులు రావడంతో ఉపాధ్యాయులతో పాటు తల్లితండ్రులు కూడా ప్రశ్నించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )