బెంగుళూర్ లో 77 కిలోల బంగారం దొంగతనం, ఈ చోరీలో ఇరువురు నిందితులను పులకేశినగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్న ఇరువురు నేపాల్ సరిహద్దులో తలదాచుకున్నారనే సమాచారం మేరకు ప్రత్యేక పోలీసుల బృందం అరెస్టు చేసింది. ఇరువురి నుంచి 8 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించి మరో పది మంది నిందితుల కోసం గాలింపులు ముమ్మరం చేశారు. ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయ గోడకు కన్నం వేసి 12 మంది నిందితులు పథకం ప్రకారం బంగారాన్ని చోరీ చేశారు. భారీ స్థాయిలో చోరీ చేసిన బంగారాన్ని ఒకరిద్దరే మార్పు చేయడం సాధ్యం కాదని పంచుకున్నారు. ఇదే వేళ భద్రతా సిబ్బందికి 8 కేజీల బంగారం ఇచ్చారు. ఇలా బంగారంతో నేపాల్ సరిహద్దులకు చేరుకుని తలదాచుకుంటున్న ఇద్దరిని అరెస్టు చేశారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )